|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 02:16 PM
AP: పాలు, నెయ్యి, వెన్న వంటి పాల ఉత్పత్తులలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాల వంటి ప్రమాదకర రసాయనాలను కలుపుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కల్తీ పాల వల్ల కిడ్నీలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు పాల ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు FSSAI లోగో, లైసెన్స్ నంబర్‌ను తప్పనిసరిగా సరిచూసుకోవాలని సూచించారు. కల్తీపై ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు 1100, 1800 425 3857కు కాల్ చేయాలని మంత్రి సూచించారు.
Latest News