|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 12:09 PM
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు.. ఇరాన్.. అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు సిలిండర్లు బుకింగ్ కూడా కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో జనం ప్రత్యామ్న్యాయ మార్గాలను వెతుకుతున్నారు. ఇండక్షన్ స్టవ్ ల వైపు జనం పరుగులు తీయడంతో వాటికి కూడా అమాంతం డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సైట్స్ లో కూడా వీటి కోసం జనం ఎగబడుతున్నారు. ఇండక్షన్ స్టవ్ అంటే ఇప్పటికీ చాలామందికి తెలియదు.. అలాంటి ఇండక్షన్ స్టవ్ లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం ఆశ్చర్యమే..
Latest News