|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 11:58 AM
ఉగాది మహోత్సవాల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిమంది భక్తులు తరలిరావడంతో ఘాట్ రోడ్డు వాహనాలతో కిటకిటలాడుతోంది. వాహనాలు, పాదయాత్రగా వస్తున్న భక్తుల రద్దీ కారణంగా ఘాట్ రోడ్డులో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Latest News