|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 06:54 PM
మీ పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇకపై సులభతరం కానుంది. ఇప్పటి వరకూ రెవెన్యూ శాఖ నుంచి పొజిషన్ సర్టిఫికెట్ కావాలని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో అడిగేవారు. అయితే ఏపీలో కొత్తగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. దీని ప్రకారం రిజిస్ట్రేషన్ చేయబోయే వ్యవసాయేతర స్థలాలకు సంబంధించి.. సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. అయితే ఈ స్థలాలపై ఇతరులకు హక్కు లేదని.. నిషేధిత భూముల జాబితాలో లేవని డిక్లరేషన్ లో పేర్కొనాలి. ఒకవేళ తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం సూచించింది.
Latest News