|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 04:57 PM
ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు మొత్తం రూ.1912.99 కోట్ల సాయం చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆరు రాష్ట్రాలకు ప్రకృతి వైపరీత్యాల సహకారం కింద ఈ సాయం అందిస్తారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీలో నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, నాగాలాండ్‌లకు ఈ అదనపు సాయానికి ఉన్నత స్థాయి కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2025లో మొంథా తుఫాన్, ఆకస్మిక వరదలతో ఆయా రాష్ట్రాలు నష్టపోయాయి. ఈ మేరకు ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం సాయాన్ని ప్రకటించింది. మొత్తం రూ.1912.99 కోట్లలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.341.48 కోట్ల అదనపు సాయం అందించనున్నారు.
ఏపీకి రూ.341.48 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.15.70 కోట్లు, గుజరాత్‌కు రూ.778.67 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.288.39 కోట్లు, నాగాలాండ్‌కు రూ.158.41 కోట్లు, జమ్మూ కాశ్మీర్‌కు రూ.330.04 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రాలకు Rs. 20.735.20 కోట్లు.. 21 రాష్ట్రాలకు రూ.3,628 కోట్లు ఎన్డీఆర్‌ఎఫ్ కింద విడుదల చేసింది.
ఏపీకి నిధుల కోసం రిక్వెస్ట్
మరోవైపు కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను అమలాపురం ఎంపీ శ్రీ హరీష్ బాలయోగి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ రవి నాయుడుతో కలిసి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి కోసం జనవరిలో ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో మరిన్ని క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి కోసం అదనపు గ్రాంట్లు మంజూరు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యతతో గ్రాంట్లు అందజేస్తామని కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో రూ.1,106 కోట్ల అంచనా వ్యయంతో 53 ప్రాజెక్టులకు సంబంధించినప్రతిపాదనలు అందజేశారు. అలాగే ఖేలో ఇండియా పథకం కింద నిధులు మంజూరు చేయాలని కూడా కేంద్రమంత్రిని కోరారు.
Latest News