|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 03:50 PM
విద్యార్థినులు, ఉద్యోగినులకు రుతుస్రావ సమయంలో సెలవులు మంజూరు చేసేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల కోసం రుతుస్రావ సెలవులను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావడం వారి ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలిపారు. "రుతుస్రావ సెలవులపై చట్టం చేస్తే, యజమానులు మహిళలను ఉద్యోగంలోకి తీసుకోరు. ఇది మహిళల్లో కూడా తాము పురుషుల కన్నా 'తక్కువ' అనే మానసిక భయాన్ని, భావనను సృష్టిస్తుంది" అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
Latest News