|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 03:10 PM
జర్మనీలోని స్వరం బయోటిక్స్ సంస్థ సైబోర్గ్ బొద్దింకలను అభివృద్ధి చేస్తోంది. వీటి వెనుక భాగంలో కెమెరాలు, సెన్సార్లు అమర్చి, విద్యుత్ సంకేతాల ద్వారా కదలికలను నియంత్రిస్తారు. ఇరుకైన ప్రదేశాల్లో చొరబడే, కఠిన పరిస్థితుల్లో జీవించే బొద్దింకలను గూఢచర్యం, సైనిక కార్యకలాపాలు, రక్షణ చర్యల్లో ఉపయోగించనున్నారు. ప్రకృతి విపత్తుల్లో చిక్కుకున్న వారిని గుర్తించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. బయో-రోబోటిక్స్ భవిష్యత్తులో కీలక సాంకేతిక విప్లవంగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Latest News