|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 02:43 PM
భారత్, అమెరికా మధ్య కీలక ఖనిజాల సరఫరాకు సంబంధించి త్వరలో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఈ ఒప్పందంపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, ఇది ఇరు దేశాల మధ్య సహకారాన్ని, సరఫరా గొలుసులను బలోపేతం చేస్తుందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.నేడు అయన 'ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026'లో మాట్లాడుతూ... "భారత్, అమెరికా ఒకరిపై ఒకరు ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. ఇది కేవలం వాణిజ్య సంబంధాలకు మించిన లోతైన భాగస్వామ్యాన్ని సూచిస్తోంది" అని గోర్ అన్నారు. ఈ బంధం మరింత బలపడుతూ వ్యూహాత్మక సహకారంలో కొత్త దశకు చేరుకుంటోందని వివరించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఇరు దేశాల సంబంధాలు "ప్రపంచ స్థాయి శిఖరాలకు" చేరే సామర్థ్యం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Latest News