|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 02:38 PM
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ, ఫ్రాంచైజీలకు పలు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జట్ల ప్రాక్టీస్ సెషన్ల విషయంలో పారదర్శకత, సమాన అవకాశాలు కల్పించే దిశగా కొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం ఒక జట్టు ప్రాక్టీస్ చేసిన పిచ్‌ను లేదా నెట్స్‌ను మరో జట్టు తమ సెషన్ కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.బీసీసీఐ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రతి జట్టుకు వారి ప్రాక్టీస్ సెషన్ కోసం తాజాగా సిద్ధం చేసిన నెట్స్‌ను మాత్రమే కేటాయించాలి. ఒకే సమయంలో గానీ, లేదా ఒకరి తర్వాత మరొకరు గానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, మొదటి జట్టు వాడిన నెట్స్‌ను రెండో జట్టు ఉపయోగించడానికి వీల్లేదు. ఒకవేళ ఒక జట్టు ముందుగా ప్రాక్టీస్ ముగించినప్పటికీ, వారి రేంజ్-హిట్టింగ్ వికెట్‌ను లేదా నెట్స్ (త్రో-డౌన్స్‌తో సహా)ను రెండో జట్టు వాడకూడదని పేర్కొంది.ప్రాక్టీస్ మ్యాచ్‌లపైనా సైతం బీసీసీఐ స్పష్టమైన సూచనలు చేసింది.
Latest News