|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 01:35 PM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు.జస్టిస్ లిసా గిల్ నియామకం రాష్ట్ర న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది. అమరావతిలో జరిగిన ఈ వేడుకలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలోనే తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. న్యాయరంగంలో ఆమెకు ఉన్న అపారమైన అనుభవం, అందించిన సేవలను గుర్తించి ఉన్నత న్యాయస్థానం ఈ కీలక బాధ్యతలను ఆమెకు అప్పగించినట్లు తెలుస్తోంది.
Latest News