|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 03:32 PM
అరకులో వైయస్ఆర్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నేతృత్వం వహించగా,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి, అనంతరం దివంగత మహానేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ... వైయస్ఆర్ ఆశయాలను సాధించడమే పార్టీ లక్ష్యమని అన్నారు. పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేసి 2029లో మళ్లీ విజయం సాధించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల గడపగడపకు సంక్షేమం, అభివృద్ధి అందించిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు చెప్పుకునేలా ఏమీ చేసిందని ప్రశ్నించారు. అనంతరం అరకులోయ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
Latest News