|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 03:18 PM
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో వైయస్ఆర్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పురష్కరించుకొని పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డి రఘురామ్ నాయుడు మాట్లాడుతూ.... పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం గర్వకారణమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో ఒకరని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ వైయస్ఆర్‌సీపీ అని, ఇచ్చిన హామీలను అమలు చేసిన పార్టీ ఇదే అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Latest News