|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 11:45 AM
ఉద్యోగం చేస్తూ సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలవనుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ వంటి సంతాన సాఫల్య చికిత్సలకు రాయితీ కల్పించనున్నారు. రెండో సంతానం నుంచి రూ.25 వేల ఆర్థిక ప్రోత్సాహకాన్ని కూడా అందించాలని నిర్ణయించారు.అలానే సిజేరియన్ ప్రసవాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 67.5 శాతంగా ఉన్న సీ-సెక్షన్ల రేటును 40 శాతం కంటే తక్కువకు తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ పదవీ విరమణకు రెండేళ్లు ముందున్న సుమారు 50 వేల మంది ఉద్యోగులకు 'వెల్‌నెస్ లీవ్' పేరుతో సరికొత్త ప్రయోజనాన్ని ప్రకటించింది. దీని కింద ఉద్యోగులకు 15 రోజుల పాటు ప్రత్యేక సెలవుతో పాటు ఆరోగ్య పరీక్షల కోసం రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
Latest News