|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 10:55 AM
మాజీ ముఖ్యమంత్రి జగన్ స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటికీ 15 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. 12.03.2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన రాజకీయ పార్టీ , తక్కువ సమయంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా తయారైంది. పార్టీని ప్రారంభించిన ఏడాదికే 17 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న వైయస్ఆర్‌సీపీ..2014 మేలో జరిగిన ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలిచి.. ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత రైతు భరోసా యాత్ర, ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో చేపట్టిన ధర్నాలతో పాటు ఇచ్చాపురం నుంచి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు (మార్చి 12) ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.
Latest News