మధ్యప్రదేశ్‌లో అల్లుడి ప్రాణం కోసం పోరాడి.. తన ప్రాణాన్ని వదిలిన మామ
 

by Suryaa Desk | Wed, Mar 11, 2026, 07:20 PM

ఐటీ రాజధాని బెంగళూరులో డెలివరీ ఏజెంట్ల ఆగడాలు మరోసారి కలకలం రేపాయి. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్‌కు చెందిన ఒక డెలివరీ బాయ్.. సరైన అడ్రస్‌కు రమ్మని చెప్పినందుకే కస్టమర్‌పై కోపం తెచ్చుకుని అమానుషంగా దాడి చేశాడు. ఇంటికి వెళ్లిన వెంటనే అతడి ముక్కు పగులగొట్టి.. అతడు ఆర్డర్ చేసిన వస్తువులు అక్కడే పడేసి పరారయ్యాడు. అయితే కస్టమర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.


అసలేం జరిగిందంటే..?


బాధితుడు పాల్ జె. వితాయతిల్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 2.00 గంటలకు) బ్లింకిట్ యాప్ ద్వారా ఆయన కొన్ని వస్తువులను ఆర్డర్ చేశారు. అయితే డెలివరీ ఏజెంట్.. వితాయతిల్ ఇంటికి రాకుండా వేరే లొకేషన్‌కు వెళ్లాడు. దీంతో కస్టమర్ ఫోన్ చేసి.. సరైన చిరునామాకు రావాలని కోరారు. ఈ క్రమంలో ఫోన్లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటి తర్వాత బాధితుడి ఇంటికి చేరుకున్న డెలివరీ ఏజెంట్.. నేరుగా వితాయతిల్‌పై దాడికి దిగాడు.


విచక్షణారహితంగా ఆయన ముక్కుపై బలంగా గుద్దడంతో వితాయతిల్ కిందపడిపోయారు. దీంతో భయపడిపోయిన డెలివరీ ఏజెంట్.. ఆర్డర్ చేసిన వస్తువులను అక్కడే పారేసి క్షణాల్లోనే పరారయ్యాడు. అయితే కాసేపటికే తేరుకున్న బాధితుడు తీవ్ర రక్తస్రావం కావడంతో.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడే పరీక్ష చేసిన వైద్యులు అతడి ముక్కు ఎముక విరిగినట్లు ధ్రువీకరించారు. అయితే ఎవరో దాడి చేయడం వల్లే అతడి ముక్కు ఎముక విరిగిపోవడంతో.. వైద్యులు పోలీసులను రంగంలోకి దింపారు. ఇలా బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


బ్లింకిట్ స్పందన ఇదే..!


నిందితుడి వివరాల కోసం పోలీసులు బ్లింకిట్ సంస్థను సంప్రదించారు. ఆ ఏజెంట్ ఫోన్ నంబర్, నివాస వివరాలను సేకరించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కాగా ఈ ఘటనపై బ్లింకిట్ తీవ్రంగా స్పందించింది. తమ ప్లాట్‌ఫారమ్‌లో ఇలాంటి హింసాత్మక చర్యలకు తావులేదని, సదరు ఏజెంట్‌ను శాశ్వతంగా బ్లాక్ చేశామని పేర్కొంది. బాధితుడికి అవసరమైన చట్టపరమైన సహకారాన్ని అందిస్తామని సంస్థ స్పష్టం చేసింది.

Latest News
Iran rejects taking part in 2nd round of peace talks with US Mon, Apr 20, 2026, 11:05 AM
Office absorption in India up by 20 pc in Jan-March amid rapid GCC expansion Mon, Apr 20, 2026, 10:58 AM
Sensex, Nifty slip in early trade amid fresh West Asia jitters Mon, Apr 20, 2026, 10:53 AM
IPL 2026: It was exceptional to see, says PBKS skipper Iyer on Arya-Connolly batting Mon, Apr 20, 2026, 10:49 AM
Vijay-Sangeetha divorce case comes up for hearing in TN court today Mon, Apr 20, 2026, 10:41 AM