|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 02:14 PM
మన బాధ్యత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గారా అజయ్ కుమార్, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపు పొందిన తమ సంస్థ కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కుల, మత, ప్రాంత, లింగ బేధాలు లేకుండా నియామకాలు జరుగుతాయని, సమాజం పట్ల అవగాహన, స్పందించే గుణం లేదా మంచి పనులు చేయాలనే సంకల్పం ఉన్నవారు సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఒకే ఆలోచనతో ఉన్న వ్యక్తులు కలిసి పనిచేస్తే మంచి మార్పు తీసుకురావచ్చని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ తూర్పు గోదావరి, రాజమండ్రి సిటీలో జోరుగా సాగుతోంది.
Latest News