|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 01:55 PM
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్ తగిలింది. ఆయనపై విజయవాడ సూర్యారావుపేట PS లో చీటింగ్ కేసు నమోదైంది. ఓ చర్చి ట్రస్ట్ రెన్యువల్ కోసం డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ ట్రస్ట్ మెంబర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ సీబీఎన్‌సీ చర్చి ట్రస్ట్ రెన్యువల్ కోసం మాజీ ఎంపీని ట్రస్ట్ మెంబర్ ఆశ్రయించారు. ఇందుకోసం మాజీ ఎంపీ రూ.25 లక్షలు తీసుకున్నారని బాధితుడు తెలిపారు.2021లో ట్రస్ట్ సభ్యులతో కలిసి నందిగాం సురేశ్‌కు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన నివాసంలో రూ.25 లక్షలు ఇచ్చినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగినట్లు ట్రస్ట్ మెంబర్ తెలిపారు. ఈ క్రమంలో మాజీ ఎంపీపై 318(4), 351(2) సెక్షన్ల కింద సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News