|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 12:53 PM
కేంద్ర మాజీ మంత్రి, ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన కావూరి సాంబశివరావు బుధవారం హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన 1984, 1989, 1998లో మచిలీపట్నం నుంచి, 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. ఆయన మరణంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.రాష్ట్ర విభజన అనంతరం కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొంతకాలం టీడీపీతో సన్నిహితంగా వ్యవహరించిన ఆయన తరువాత బీజేపీలో చేరారు. ఆయన మృతి పట్ల ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో కావూరి సాంబశివరాలు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు
Latest News