|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 10:14 AM
కూటమి ప్రభుత్వం ఆధ్వర్వంలో టీటీడీ చైర్మన్ గా బీ ఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చరిత్రలో మునుపెన్నడూ లేని ఘటనలు తిరుమలలో చోటుచేసుకుంటున్నాయి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అయన మాట్లాడుతూ... ప్రజలు, భక్తులు జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నారు. పరకామణిలో రూ.1 కోటి విలువైన బంగారం, వెండి కానుకలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య చోరీ చేస్తే... ఆ ఘటనను ప్రభుత్వం, టీటీడీ, పోలీసులు సైతం కనీసం బయటకు రానివ్వకుండా తొక్కిపెట్టారు. మరోవైపు తాను దోచుకున్న స్వామి వారి కానుకలను పెంచలయ్య తిరుపతిలో బ్యాంకులో తాకట్టు పెట్టడంతో పాటు, ప్రముఖ బంగారు షాపుల్లో నగల రూపంలో మార్పు చేశాడు. ఇంత పెద్ద ఎత్తున బంగారం చోరీ జరిగితే టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు ఎందుకు ఈ విషయాలను మీడియా దృష్టికి తీసుకుని రాలేదు? చంద్రబాబు సైతం ఎందుకు మౌనంగా ఉన్నారు? గతంలో వైయస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు పరకామణిలో డాలర్లు చోరీ ఉదంతంలో గగ్గోలు పెట్టిన కూటమి నేతలు... ఈ కేసులో మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది అని మండిపడ్డారు.
Latest News