|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 10:21 PM
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా ఉన్న హేమంగ్ బదానీకి మరో కీలక బాధ్యత దక్కింది. ఇంగ్లాండ్‌లో నిర్వహించే హండ్రెడ్ టోర్నీలో పాల్గొనే సదరన్ బ్రేవ్ పురుషుల జట్టుకు కూడా ఆయనను హెడ్ కోచ్‌గా నియమించారు.ఈ రెండు జట్లలో కూడా జీఎంఆర్ గ్రూప్ సహ యజమానిగా ఉండటం విశేషం. ఇదే సమయంలో బ్రేవ్ యాజమాన్యం హేమంగ్ బదానీకి సహాయంగా అసిస్టెంట్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్‌ను ఎంపిక చేసింది.కాగా, జీఎంఆర్ గ్రూప్‌కు ప్రపంచవ్యాప్తంగా పలు క్రికెట్ లీగ్‌లలో జట్లు ఉన్నాయి. ఐపీఎల్‌తో పాటు మేజర్ లీగ్ క్రికెట్‌లో సియాటిల్ ఆర్కాస్, అలాగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో దుబాయ్ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు కూడా జీఎంఆర్ గ్రూప్‌కు చెందినవే.సదరన్ బ్రేవ్ జట్టు హండ్రెడ్ లీగ్ తొలి సీజన్‌లోనే టైటిల్‌ను గెలుచుకుంది. అనంతరం 2024 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచింది. అయితే గత సీజన్‌లో మాత్రం ఆశించిన ప్రదర్శన చేయలేకపోయి పలు మ్యాచ్‌లు ఓడి నాకౌట్ దశకు కూడా చేరలేకపోయింది.ఇదిలా ఉండగా, హండ్రెడ్ లీగ్ 2026 సీజన్ జులై 21 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఎంఐ లండన్ మరియు సన్‌రైజర్స్ లీడ్స్ తలపడనున్నాయి. జులై 22న జరిగే మరో మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ జట్టు వెల్ష్ ఫైర్‌తో పోటీ పడనుంది.ఈ సీజన్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే హండ్రెడ్ లీగ్‌లో తొలిసారి వేలం ప్రక్రియ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. మార్చి 11, 12 తేదీల్లో జరిగే ఈ వేలానికి 18 దేశాలకు చెందిన సుమారు 400 మంది ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ అయ్యారు. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఈ వేలంలో పాల్గొననున్నాయి.
Latest News