|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 07:35 PM
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పెట్రోలియం కంపెనీలు నియంత్రణలు విధించాయి. హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలని గ్యాస్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హాస్టళ్లకు మాత్రమే సిలిండర్లను సరఫరా చేయాలని సూచించాయి. మరోవైపు గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని కంపెనీలు స్పష్టం చేశాయి. ఈ-కేవైసీ చేయని గృహ వినియోగదారులకు గ్యాస్ బుకింగ్ సౌకర్యాన్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి. వెంటనే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Latest News