పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
 

by Suryaa Desk | Tue, Mar 10, 2026, 04:23 PM

వేసవి వచ్చిందంటే చాలు, దాహం తీర్చుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి మనం అనేక రకాల పండ్లను తింటాం.. వాటిలో పుచ్చకాయ అత్యంత ప్రాచుర్యం పొందింది. పుచ్చకాయలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇది కేవలం రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ముందుంటుంది. వేసవిలో ఉచ్చకాయ తీసుకుంటే.. కడుపు చల్లగా ఉంటుంది. ఇంకా హైడ్రేటెడ్ గా ఉండటంతోపాటు.. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, పుచ్చకాయను ఆస్వాదించే ముందు దాని ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..? ఎవరు దీనిని తినకూడదు అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి, డీహైడ్రేషన్ బారి నుండి రక్షిస్తుంది. పొటాషియం, ఐరన్, కాల్షియం, రాగి, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి1, బి6, సి, డి, లైకోపిన్ వంటి అనేక కీలక పోషకాలు ఇందులో ఉన్నాయి.రోగనిరోధక శక్తి: విటమిన్ ఎ, సి లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.జీర్ణక్రియ: అధిక నీటి శాతం, పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.. మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి.గుండె ఆరోగ్యం: ఎల్.డి.ఎల్. (చెడు కొలెస్ట్రాల్) ను తగ్గించి, రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.రక్తపోటు నియంత్రణ: సిట్రులిన్ అనే యాసిడ్ రక్తపోటును తగ్గించడంలో తోడ్పడుతుంది. హై బిపి ఉన్నవారు పుచ్చకాయను ధైర్యంగా తీసుకోవచ్చు.

Latest News
Maruti Suzuki India's Q4 net profit dips 6.4 pc to Rs 3,659 crore, announces Rs 140 dividend Tue, Apr 28, 2026, 04:26 PM
Varanasi decked up for PM Modi's two day visit to unveil Rs 6,300 crore projects Tue, Apr 28, 2026, 04:22 PM
Akhilesh Yadav visits BJP MLA who was injured while burning SP chief's effigy Tue, Apr 28, 2026, 04:16 PM
Delhi L-G Sandhu reviews summer action plan at integrated command centre Tue, Apr 28, 2026, 04:14 PM
Maturity as a cricketer comes from learning outside the field: Shreyas Iyer Tue, Apr 28, 2026, 03:33 PM