|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 02:37 PM
భారతదేశంలో స్లీప్ డివోర్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్లీప్ డివోర్స్ అంటే, నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి జంటలు వేర్వేరు గదుల్లో నిద్రించడం. గురక, నిద్ర షెడ్యూల్స్, పని ఒత్తిడి, జీవనశైలి వంటి కారణాలు దీనికి దోహదం చేస్తున్నాయి. అయితే, ఇది బంధంలో చీలికలకు కారణం కాదని, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని, దీనిపై అవగాహన పెరగడంతో చాలా మంది స్లీప్ డివోర్స్‌కు ఆసక్తి చూపుతున్నారు.
Latest News