టీసీఎస్ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ వరకు 875 స్టాక్స్ ఆల్ టైమ్ లో..! 2 సెషన్లలో 12 లక్షల కోట్లు లాస్
 

by Suryaa Desk | Mon, Mar 09, 2026, 10:44 PM

అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం, మధ్యలో అమెరికా కూడా ఇరాన్‌పై దాడులు చేస్తుండటం.. ఇరాన్ ప్రతిదాడుల వల్ల రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకవైపు ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిలకు పడిపోవడం వంటి వాటి నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా పతనం అవుతున్నాయి. సోమవారం సెషన్‌లో కూడా ఇంట్రాడేలో ఒక దశలో సెన్సెక్స్ 2300 పాయింట్లకుపైగా పడిపోగా చివరకు 1350 పాయింట్ల నష్టంతో ముగిసింది. గత 2 సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ. 12 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది. మార్చి 9 (సోమవారం) సెషన్‌లోనే చూస్తే దాదాపు 875 షేర్లు 52 వారాల కనిష్ఠాలకు పడిపోయాయి. ఇందులో ప్రముఖ టాటా గ్రూప్ స్టాక్ టీసీఎస్ సహా HDFC బ్యాంక్ కూడా ఉన్నాయి.


>> గురువారం రోజు సెషన్‌ ముగిసే సరికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 453 లక్షల కోట్లుగా ఉండగా.. ఇది సోమవారం ముగిసే సరికి రూ. 441 లక్షల కోట్లకు పడిపోయింది. శుక్రవారం, సోమవారం రెండు రోజుల్లోనే భారీగా పతనమైంది. వరుసగా రెండు సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీ 50 కలిసి 3 శాతం వరకు పడిపోయాయి.


మార్చి 9న ఆల్ టైమ్ లోను తాకిన ప్రముఖ స్టాక్స్..


ముందుగా ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ ఉంది. ఇంట్రాడేలో 4 శాతానికిపైగా పతనంతో రూ. 821.50 వద్ద ఆల్ టైమ్ లోను నమోదు చేసింది. చివరికి రూ. 839.10 వద్ద ముగిసింది. టీసీఎస్ షేర్ 2 శాతం వరకు నష్టంతో రూ. 2,505 వద్ద ఆల్ టైమ్ లోను తాకింది. చివరకు 1.17 శాతం పతనంతో రూ. 2,527.80 వద్ద స్థిరపడింది.


ఈ రెండింటితో పాటు విప్రో, ఏషియన్ పెయింట్స్, ఇండిగో, ట్రెంట్, అంబుజా సిమెంట్స్ వంటివి బీఎస్ఈలో సోమవారం సెషన్‌లో 52 వారాల కనిష్ఠాల్ని నమోదు చేశాయి. ఇంకా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, సుజ్లాన్ ఎనర్జీ, శ్రీ సిమెంట్, ఆర్ఈసీ, ఇన్ఫో ఎడ్జ్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, గెయిల్, డిక్సన్ టెక్నాలజీస్, డీఎల్ఎఫ్, కోఫోర్జ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటివి ఉన్నాయి.


ఇదిలా ఉండగా.. మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, సిటుర్జియా బయోకెమికల్స్, జిందాల్ పాలీ ఫిల్మ్స్, మోతీలాల్ ఓస్వాల్ ఇండియా డిఫెన్స్ ఈటీఎఫ్, ఎస్బీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మూమెంటమ్ 50 ఈటీఎఫ్ వంటివి బీఎస్ఈలో సోమవారం సెషన్‌లో 52 వారాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి.

Latest News
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM
India Post Payments Bank's SHG savings account to boost financial inclusion Thu, Apr 30, 2026, 04:31 PM
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM