|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 08:13 PM
విశాఖపట్నంలోని రామ్ నగర్‌లోని ఎలిగేంట్ హోటల్‌లో రోటరీ క్లబ్ గ్రేటర్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. క్లబ్ ప్రెసిడెంట్ చింతా నేతాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆటపాటలతో పాటు మహిళల విజయ గాథలను పంచుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మిస్సెస్ ఏవీఎన్ కళాశాల ప్రిన్సిపల్ పి. కృష్ణకుమారి మాట్లాడుతూ, మగపిల్లలకు చిన్నప్పటి నుంచే మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించేలా తల్లులు దిశానిర్దేశం చేయాలని, అప్పుడే మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడ్డారు.
Latest News