|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 12:14 PM
నేటి కాలంలో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడంతో చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనికి పరిష్కారంగా, వంటింట్లో దొరికే నువ్వుల లడ్డూను ప్రతిరోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నల్ల నువ్వులు, బెల్లం, యాలకుల పొడి, నెయ్యితో తయారుచేసే ఈ లడ్డూలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, ఎముకలను బలపరుస్తుంది. మహిళల్లో పీరియడ్స్ నొప్పులను తగ్గించడంతో పాటు, అలసటగా ఉన్నప్పుడు తక్షణ శక్తిని అందిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. గర్భిణీలు, పిల్లలు, పాలిచ్చే తల్లులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
Latest News