ప్రెగ్నెన్సీ సమయంలో ఖర్జూరాలు తినడం సురక్షితమేనా
 

by Suryaa Desk | Sun, Mar 08, 2026, 10:24 PM

గర్భధారణ సమయంలో ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో చాలా విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో తినే ఆహారం నుంచి బరువులు ఎత్తడం వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఇక, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక, ప్రెగ్నెన్సీ సమయంలో ఖర్జూరాలు తినడం గర్భవతులకు చాలా సురక్షితం మాత్రమే కాదు. పరిమితంగా తీసుకుంటే ఎంతో ప్రయోజనకరం కూడా అని డాక్టర్ సింధూరి కాపు, కన్సల్టెంట్ ప్రసూతి వైద్యులు & గైనకాలజిస్ట్, అంకురా హాస్పిటల్ తెలిపారు. ఖర్జూరం తినే విషయంలో ఉన్న అపోహలపై క్లారిటీ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.


డాక్టర్ ఏం చెప్పారు?


ఖర్జూరాలు తినడం గర్భవతులకు చాలా మంచిది. పరిమితంగా తీసుకుంటే ఎంతో ప్రయోజనకరం కూడా. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల మేలు జరుగుతుంది. గర్భం దాల్చిన చివరి వారాల్లో ఖర్జూరాలు తినడం వల్ల గర్భాశయ ద్వారం మెత్తబడి  ప్రసవం కొంత సులభం అయ్యే అవకాశం ఉంటుంది.


డాక్టర్ సింధూరి కాపు.


ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు


పోషకాల గని: ఖర్జూరాల్లో సహజ సిద్ధమైన చక్కెరలు, ఫైబర్, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తల్లికి అవసరమైన శక్తిని, పోషణను అందిస్తాయి.


మలబద్ధకం నుంచి ఉపశమనం: ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటారు. ఖర్జురాలు తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ ఈ సమస్యను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.


సులభ ప్రసవం: గర్భం దాల్చిన చివరి వారాల్లో ఖర్జూరాలు తినడం వల్ల గర్భాశయ ద్వారం మెత్తబడి (Cervical ripening) ప్రసవం కొంత సులభం అయ్యే అవకాశం ఉందని నేషనల్ లైబర్రీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక చెబుతుంది.


పిండం అభివృద్ధి: నేషనల్ లైబర్రీ ఆఫ్ మెడిసిన్‌లో పబ్లిష్ అయిన మరో నివేదిక ప్రకారం ఖర్జూరాలు తినడం వల్ల పిండం అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఖర్జూరాల్లో ఫోలేట్ అనే ఖనిజం ఉంటుంది. ఇది శిశువు మెదడు, వెన్నుపాము అభివృద్ధిపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. పిండం యొక్క మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపే అనేక ముఖ్యమైన పోషకాల్ని కలిగి ఉంటుంది.


గుర్తించుకోవాల్సిన జాగ్రత్తలు


మితంగా తినాలి: ఖర్జూరాల్లో కేలరీలు, చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని అతిగా తింటే బరువు పెరగడం లేదా రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది.


ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్: ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డయాబెటిస్ (Gestational Diabetes) ఉన్నవారు లేదా షుగర్ వచ్చే అవకాశం ఉన్నవారు వీటిని తినే ముందు తప్పనిసరిగా వైద్యుణ్ని సంప్రదించాలి. డైట్ ప్లాన్ ప్రకారం మాత్రమే వీటిని తీసుకోవాలి.


ఖర్జూరాల్ని ఎప్పుడు తినాలి?


ఖర్జూరాల్ని మొదటి మూడో నెల నుంచి తినవచ్చు. అయితే, పరిమితంగా తినాలని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు. రెండు ఖర్జూరాల్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు.


ప్రెగ్నెన్సీ చివరి త్రైమాసికం అంటే చివరి మూడు నెలల్లో ఖర్జూరాలు తినడం ఇంకా మంచిది.


చివరి త్రైమాసికంలో బ్రేక్‌ఫాస్ట్‌లో 6 నుంచి ఏడు ఖర్జూరాల్ని తినవచ్చని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు.


ప్రెగ్నెన్సీ సమయంలో తినాల్సిన ఇతర సూపర్ ఫుడ్స్


ఖర్జూరాలతో పాటు ఈ కింద పేర్కొన్న ఫుడ్స్‌ మీ డైట్‌లో ఉంటే చాలా మంచిది.


 పాలకూర, ఆకుకూరలు: వీటిలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బిడ్డ మెదడు, వెన్నెముక ఎదుగుదలకు తోడ్పడతాయి.


గుడ్లు: వీటిలో ప్రోటీన్‌తో పాటు కోలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది బిడ్డ మెదడు అభివృద్ధికి అవసరం.


పెరుగు లేదా పాలు: కాల్షియం కోసం ఇవి చాలా ముఖ్యం. బిడ్డ ఎముకల బలంగా ఉండటానికి ఇవి సాయపడతాయి.


నట్స్ (బాదం, వాల్‌నట్స్): ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ కోసం బాదం, వాల‌్‌నట్స్ వంటివి రోజూ కొన్ని తీసుకోవాలి.


ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి?


గర్భధారణ సమయంలో కొన్ని ఫుడ్స్ తినడం వల్ల ఇబ్బంది కలగవచ్చు.


పచ్చి పైనాపిల్, పచ్చి బొప్పాయి: ఈ రెండింటిలో ఉండే కొన్ని ఎంజైమ్స్ గర్భాశయ సంకోచాలకు కారణం కావచ్చు. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉండొచ్చు.


అధిక కెఫిన్ పదార్థాలు: కాఫీ, టీలను వీలైనంత వరకు తగ్గించాలి. రోజుకు ఒక కప్పు కంటే ఎక్కువ వద్దు.


బాగా ఉడకని మాంసం, గుడ్లు: వీటి వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే వీటిని బాగా ఉడికించిన తర్వాతే తినాలి.


ఎక్కువ ఉప్పు, నూనె: ఉప్పు, నూనె ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం వల్ల కాళ్ల వాపులకు, బీపీ పెరగడానికి కారణం కావచ్చు.


పాటించాల్సిన ఇతర చిట్కాలు


వాకింగ్: రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం వల్ల రక్త ప్రసరణ బాగుంటుంది.


ధ్యానం: ప్రెగ్నెన్సీ సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజుకు 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి.


నీరు ఎక్కువగా తాగాలి: డీహైడ్రేషన్ బారిన పడకుండా రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.


నిద్ర: రాత్రిపూట కనీసం 8 గంటల గాఢ నిద్ర అవసరం. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల బిడ్డకు రక్త ప్రసరణ బాగా అందుతుంది.


చివరగా ఏం తెలుసుకోవాలి?


ఏదైనా కొత్త ఆహారం లేదా వ్యాయామం మొదలుపెట్టే ముందు మీ వైద్యుణ్ని సంప్రందించి తగిన సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్న గర్భవతులు సమతుల్య ఆహారంలో భాగంగా రోజుకు కొన్ని ఖర్జూరాలు తీసుకోవడం పూర్తిగా సురక్షితం.శరీర తత్వాన్ని బట్టి, డాక్టర్ సలహా మేరకు వీటిని ఆహారంలో చేర్చుకోవడం ఇంకా మంచిది.


Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM