|
|
by Suryaa Desk | Sun, Mar 08, 2026, 10:01 PM
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు పరిచయం చేశాడు. ఈ పరిచయం జరిగిన తర్వాత గంభీర్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ అహ్మదాబాద్‌కు బయల్దేరే సమయంలో పాండ్యా తన గర్ల్‌ఫ్రెండ్‌ను గంభీర్‌కు పరిచయం చేశాడు. గంభీర్ ఆమెను కలిసిన తర్వాత ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ సోషల్ మీడియా షేర్ అవుతోంది.
ఈ టోర్నమెంట్‌లో మహికా శర్మ టీమిండియా మ్యాచ్‌లకు తరచుగా హాజరవుతోంది. అయితే టోర్నమెంట్ ప్రారంభ దశలో ఆటగాళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు జట్టుతో ఉండటానికి అనుమతి లేదు. బీసీసీఐ ఆ నియమాన్ని అమలు చేసింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయంలో కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు స్టేడియంలో కనిపించారు. అదే విధంగా అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఆటగాళ్ల కుటుంబ సభ్యులు స్టాండ్స్‌లో ఉండే అవకాశం ఉంది.
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ కీలక పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్‌లో హార్దిక్ పాండ్యా స్థిరమైన ప్రదర్శనతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో అతను మొత్తం 199 పరుగులు చేశాడు. అదే సమయంలో ఎనిమిది మ్యాచ్‌ల్లో 8 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
సూపర్-8 దశలో జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్‌లో పాండ్యా అజేయ అర్ధశతకం నమోదు చేశాడు. అలాగే వెస్టిండీస్‌పై జరిగిన కీలక మ్యాచ్‌లో 14 బంతుల్లో 17 పరుగులు చేసి జట్టుకు ఉపయోగపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా పాండ్యా కీలక పాత్ర పోషించాడు. తన తొలి బంతికే ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేసి టీమిండియాకు తొలి బ్రేక్‌థ్రూ ఇచ్చాడు. ఆ తర్వాత సామ్ కరన్ వికెట్ కూడా తీసుకున్నాడు.
బ్యాటింగ్‌లో కూడా అతను మెరిపించాడు. కేవలం 12 బంతుల్లో 27 పరుగులు చేసి భారత్ స్కోరు 250 దాటేలా చేశాడు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌లో కూడా పాండ్యా ప్రదర్శన టీమిండియా విజయానికి కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కి ముందు హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను గంభీర్‌కు పరిచయం చేయడం ఆసక్తికరంగా మారింది.
Latest News