|
|
by Suryaa Desk | Sun, Mar 08, 2026, 08:16 PM
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇటీవల మ్యాచ్‌ల్లో ఫామ్ కోసం తడబడిన అభిషేక్ శర్మ, ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా ఆడుతూ ఆకట్టుకున్నాడు.11 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 137 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. అంతకుముందు సంజూ శాంసన్‌తో కలిసి అతడు ఓపెనింగ్‌లోనే వేగంగా పరుగులు సాధించాడు. పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టం లేకుండా 92 పరుగులు చేసి కివీస్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు వేగంగా పెంచుతున్నాడు.అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం ఈ రోజు ఒక కీలక మ్యాచ్‌కు వేదికైంది. టీ20 ప్రపంచకప్ టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్‌తో తలపడుతోంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి కివీస్ జట్టును ఎదుర్కొంటుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ఇరు జట్లు కూడా తమ తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగాయి.
Latest News