పాతికేళ్ల తర్వాత ఎన్టీఆర్ ఏంటి?,,,తారక్ కు ప్రెజెంటర్ ప్రశ్న
 

by Suryaa Desk | Sun, Mar 08, 2026, 06:01 PM

జూనియర్ ఎన్టీఆర్ .. సినిమాల పరంగానే కాదు తెలుగు రాజకీయాల్లోనూ వినిపించే పేరు. టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్ . 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరుఫున ఎన్టీఆర్ చేసిన ప్రచారంతో.. తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వార్తలు మొదలయ్యాయి. అయితే ఆ ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అలాగే టీడీపీ పార్టీకి కూడా. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. రాజకీయాలకు మాత్రం జూనియర్‌కు దూరం కావటం లేదు. ఏదో ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ప్రస్తావన వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రెజెంటర్ అడిగిన ప్రశ్న, దానికి తారక్ ఆలోచించి ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రి స్పెషాలిటీ బ్లాక్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు ఎన్టీఆర్. ఆయన చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రెజెంటర్ పలు ప్రశ్నలు అడగా.. తారక్ వాటికి సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే 25 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటారంటూ.. ప్రెజెంటర్ ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు కాసేపు ఆలోచించిన ఎన్టీఆర్.. పాతికేళ్ల తర్వాత ఎన్టీఆర్ 67 ఏళ్లు అవుతాడంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. అయితే ఈ ప్రశ్న అడిగిన సందర్భంలో అక్కడున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేయడం విశేషం.


అయితే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని, టీడీపీ పగ్గాలు చేపడతారంటూ గతంలో అనేకసార్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా 2019 ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీలోని కొంతమంది సైతం జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారు. అయితే వాటిపై తారక్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గ్రాండ్ విక్టరీ తర్వాత పార్టీలో నారా లోకేష్ పరపతి, పార్టీపై పట్టు పెరిగింది.


ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ సొంత పార్టీ పెట్టొచ్చనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరిగింది. అయితే ఇలాంటి ఊహాగానాలకు ఆయన నుంచి బదులు లేదు. తాజాగా పాతికేళ్ల తర్వాత తారక్ పరిస్థితి ఏంటి అన్నప్పుడు.. ఆయన ఆలోచించి ఇచ్చిన సమాధానంతో భవిష్యత్ మీద జూనియర్ ఎన్టీఆర్‌కు క్లారిటీ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM