వరుణ్ చక్రవర్తి ఫామ్‌పై ఆందోళన వద్దన్న కెప్టెన్ సూర్యకుమార్
 

by Suryaa Desk | Sun, Mar 08, 2026, 07:44 AM

టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు ముందు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్‌పై వస్తున్న ఆందోళనలను భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొట్టిపారేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో వరుణ్ భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, అతడి సత్తాపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న టైటిల్ పోరుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో సూర్య మాట్లాడాడు.సెమీఫైనల్లో వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 40 పరుగులు ఇచ్చాడు. దీనిపై సూర్య స్పందిస్తూ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది టీమ్ గేమ్. జట్టు గెలిచినప్పుడు వ్యక్తిగత ప్రదర్శనల గురించి ఎక్కువగా ఆలోచించం. ప్రతి ఆటగాడికి ప్రతీరోజూ ఒకేలా ఉండదు. అతడు ప్రపంచ నంబర్ 1 బౌలర్, వరల్డ్ క్లాస్ బౌలర్. మ్యాచ్‌లు ఎలా గెలవాలో అతడికి బాగా తెలుసు. ఫైనల్లో అతడు కచ్చితంగా రాణిస్తాడు అని ధీమా వ్యక్తం చేశాడు.భారత బ్యాటర్లు ఆఫ్ స్పిన్‌కు ఇబ్బంది పడుతున్నారన్న విశ్లేషణలపైనా సూర్య స్పందించారు.మేం దాని గురించి పెద్దగా చర్చించలేదు. గత మ్యాచ్‌లో ఇషాన్, దూబే, తిలక్ వర్మ వంటి లెఫ్ట్ హ్యాండర్లు ఆఫ్ స్పిన్నర్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఫైనల్లో ఎలాంటి బౌలింగ్ దాడి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అని తెలిపాడు.స్వదేశంలో ప్రపంచకప్ ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా ప్రత్యేకమైన అనుభూతి అని సూర్య అన్నాడు.ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. కానీ ఒత్తిడి లేకపోతే అందులో మజా ఉండదు. ఫైనల్ కోసం యావత్ భారతదేశం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. మేం సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతాం అని సూర్యకుమార్ యాదవ్ వివరించాడు.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM