|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 11:58 PM
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో సాధారణ జీవనం తీవ్రంగా దెబ్బతింటోంది. గత ఎనిమిది రోజులుగా అమెరికా–ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో దేశవ్యాప్తంగా తరచూ ఎయిర్ సైరన్లు మోగుతున్నాయి. దీంతో ఎప్పుడు ఎక్కడ క్షిపణి దాడి జరుగుతుందో తెలియని భయంతో అక్కడి ప్రజలు జీవిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో సైరన్లు ఎప్పుడు మోగుతాయో తెలియక చాలామంది స్నానం చేయడానికే కూడా జాగ్రత్త పడుతున్నారు. అందుకే కొందరు ఇజ్రాయెల్ ప్రజలు ‘Can I Shower’ అనే యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నారు. ఏ సమయంలో స్నానం చేయడం కొంతవరకు సురక్షితం అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ టూల్ సహాయపడుతోంది.క్షిపణి దాడి ప్రమాదం ఉన్నప్పుడు స్థానిక భద్రతా వ్యవస్థ వెంటనే ప్రజలకు అలర్ట్‌లు జారీ చేస్తుంది. సైరన్ వినిపించిన వెంటనే ప్రజలు బాంబు షెల్టర్లు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. దీనికి సాధారణంగా 30 నుంచి 90 సెకన్ల వరకు మాత్రమే సమయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.అయితే ‘Can I Shower’ యాప్ అధికారిక భద్రతా వ్యవస్థ కాదని స్పష్టంగా చెబుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఇది కొంత సహాయకారిగా ఉందని అక్కడి ప్రజలు అంటున్నారు. రాకెట్ దాడుల ధోరణి, అలర్ట్ డేటా వంటి అంశాలను విశ్లేషించి ఈ యాప్ సూచనలు ఇస్తుందని సమాచారం.
Latest News