|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 06:21 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’లో భాగంగా పోలీసులు, ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో కూడా పోలీసులు, ఈగల్ టీమ్ కార్డన్‌సెర్చ్ చేస్తున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా పోలీసులపైకి కాల్పులకు ప్రయత్నించాడు. బస్టాండ్ సమీపంలో బాలాజీ హోటల్ ఉంది.. పోలీసులు అక్కడికి తనిఖీల కోసం వెళ్లగా.. ఓ వ్యక్తి అనుమనాస్పదంగా కనిపించాడు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో అతడు పోలీసులు, ఈగల్ టీమ్‌పై గన్‌తో కాల్పులకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి గన్ ట్రిగ్గర్ నొక్కినా లాక్ ఓపెన్ కాకపోవడంతో బుల్లెట్లు బయటకు రాలేదట. దీంతో పోలీసులు, ఈగల్ టీమ్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఆ వెంటనే ఆ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని తెలంగాణలోని వరంగల్ జిల్లా నెల్లికుదురుక చెందిన మురళిగా గుర్తించారు. అతడి దగ్గర నుంచి 9 MM పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అతడ్ని ప్రశ్నించేందుకు టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌కు తరలించారు. అయితే ఆ వ్యక్తి విజయవాడకు ఎందుకు వచ్చాడు, గన్ ఎక్కడిది, ఏదైనా హత్యకు ప్లాన్ చేశాడా, పోలీసులపై కాల్పులు జరిపేందుకు ఎందుకు ప్రయత్నించాడు అనేది తేలాల్సి ఉంది.. పోలీసులు అత్నడి ప్రశిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీ పోలీసులు, ఈగల్ టీమ్ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’ పేరుతో ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా టీమ్‌లు రంగంలోకి దిగాయి.. తనిఖీలు చేపట్టాయి. అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను కూడా సీజ్ చేశారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టే దిశగా ఈ డ్రైవ్ చేపట్టారు.. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సరఫరా జరిగే 849 హాట్ స్పాట్స్ గుర్తించింది ఈగల్ టీమ్.. అక్కడ కూడా ఈ డ్రైవర్ చేపట్టారు.
Latest News