|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 11:59 AM
చిత్తూరు జిల్లా గంగవరం మండల పరిధిలోని వైయస్సార్ జంక్షన్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వైపునకు కారు వెళ్తున్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగింది.. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పలమనేరు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారంతా బెంగళూరు రాజాజీనగర్ కు చెందిన వారుగా గుర్తించారు. మోహన్ దాస్ కుటుంబం బెంగళూరు నుంచి తిరుమలకు కారులో వెళుతూ ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో మృతి చెందిన వారు.. మోహన్ దాస్ (71), నాగరాజరావు(61), కుసుమ(61), జయంతి(59), పూజ(33)గా గుర్తించారు.ప్రమాద దృశ్యాలు.. అక్కడున్న సీసీలో రికార్డయ్యాయి.. కంటైనర్ ను వెనుక వైపు నుంచి వేగంగా కారు ఢీకొంది. కంటైనర్ వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారు దాదాపు 500 మీటర్ల వరకు లారీ తో పాటు లాక్కెళ్ళినట్లు సిసి ఫుటేజ్ లో స్పష్టమవుతోంది. కారు.. లారీ కిందకు దూసుకెళ్లడంతో.. అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.డెడ్ బాడీలను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Latest News