|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 11:28 AM
అమెరికా–ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరగడంతో టెహ్రాన్‌లోని భారతీయ విద్యార్థుల భద్రత కోసం భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. మెడికల్ విద్యార్థులతో సహా 200 మందికి పైగా విద్యార్థులను కోమ్ నగరానికి సురక్షితంగా తరలించింది. బస్సులు, ఆహారం, వసతి, భద్రత కల్పించింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
Latest News