|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 04:08 PM
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం కీలక మలుపు తిరిగింది. యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్‌కు మద్దతుగా చైనా గళం విప్పింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని చైనా పేర్కొంది. వెంటనే ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపాలని వెల్లడించింది.పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్న వేళ ఇంతకాలం సంయమనం పాటించిన చైనా ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా చర్యలను వ్యతిరేకిస్తోందని వార్తలు వస్తున్నాయి. నిన్నటివరకు దాడులను ఖండించి, చర్చలకు పిలుపునిచ్చిన చైనా చేష్టలుడిగి చూసింది. అందుకు కారణం లేకపోలేదు. ముఖ్యంగా చమురు సరఫరా అనేది చైనాకు చాలా అవసరం. అది లేకుంటే చైనాలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయే ప్రమాదం ఉంది.అలాంటిది ఈ యుద్ధంలో ఇరాన్ కు మద్దతు తెలిపి రిస్క్ తీసుకోవాలి అని చైనా అనుకోలేదు. యుద్ధ పరిస్థితులు చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన చమురు సరఫరా మార్గాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అందుకే ఈ సంక్షోభం బీజింగ్‌కు దూరమైనది కాకుండా..ప్రత్యక్ష ఆర్థిక ప్రభావాలను కలిగించే అంశంగా మారింది. ఈ పరిస్థితుల మధ్య బీజింగ్ అధికారికంగా ఈ దాడులను ఖండిస్తూ, తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది.
Latest News