|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 03:16 PM
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, ఇరాన్‌లోని గెరాష్ నగరం కేంద్రంగా మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ అంతర్భాగంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ విపత్తు సంభవించింది. భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ఎపిసెంటర్ దగ్గర భూమి కదిలినట్లు అనిపిస్తుందని చెప్పారు. ఎలంటి ప్రమాదం జరగలేదని ఇరాన్ అధికారులు తెలిపారు. అయితే సీరియస్ డ్యామేజ్, గాయాలు అయినట్లు ఎలాంటి సమాచారం ఇంకా రాలేదు. సునామీ వచ్చే అవకాశం లేదని ప్రకటించారు. 2026, మార్చి 03న ఒకే రోజు రెండు దేశాలలో భూకంపాలు రావడం గమనార్హం. ఉదయం డోనేషియా దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భూమి ఊగిపోయింది. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూ కంపం కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. ఇది చాలా శక్తింవంతమైన భూకంపం అని స్పష్టం చేసింది ఈ సర్వే రిపోర్ట్.
Latest News