|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:52 PM
రాష్ట్ర ప్రజలకు మంత్రి నారా లోకేశ్ హోలీ పండుగను శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నారా లోకేశ్ తన సందేశంలో.. ‘వసంత రుతువుకు స్వాగతం పలికే రంగుల సంబరం హోలీ. చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ. సమత, మమతలకు చిహ్నంగా, పేదా, పెద్ద తారతమ్యాలు లేకుండా, కులమత భేదాలు చూడకుండా రంగుల్లో అంతా కలిసిపోయి ఆనందాలను పంచుకునే హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు’ అని తెలిపారు.
Latest News