|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:51 PM
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అరుదైన ఘనత సాధించి చరిత్ర సృష్టించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి అమెరికా అధ్యక్షుడి భార్యగా ఆమె నిలిచారు. నిన్న జరిగిన ఈ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించగా, మండలిలోని 15 సభ్య దేశాల శాశ్వత ప్రతినిధులు వరుసలో నిలబడి ఆమెకు స్వాగతం పలికారు. సాధారణంగా దేశాధినేతలకు కూడా లభించని ఈ గౌరవం ఆమెకు దక్కింది.ఈ సందర్భంగా మెలానియా మాట్లాడుతూ సరికొత్త ఆలోచనను ప్రపంచం ముందుంచారు. "ఒకే ఒక్క డిజిటల్ దేశం ఏర్పాటు అనివార్యమా?" అని ప్రశ్నించారు. "బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో డిజిటల్ కరెన్సీ, చెల్లింపుల వ్యవస్థలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు చెందిన విస్తృత సమాచారం ఇప్పటికే మీడియా, ఆర్థిక మార్కెట్లలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. కాబట్టి ఈ ఆలోచన మరీ అసాధ్యమేమీ కాదు. మనం ఇప్పుడు సరిహద్దుల్లేని టెక్నాలజీ యుగంలో ఉన్నాం" అని ఆమె వివరించారు.
Latest News