|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:49 PM
ఇరాన్ క్షిపణి దాడులతో అట్టుడుకుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెన్జమిన్ నెతన్యాహు సోమవారం ప్రజల ముందుకు వచ్చారు. ఇరాన్ దాడుల్లో తొమ్మిది మంది మరణించిన ‘బెయిట్ షెమేష్’ ప్రాంతంలోని ధ్వంసమైన ప్రార్థనా మందిరాన్ని (సినగాగ్) ఆయన సందర్శించారు. భారీ భద్రత నడుమ శిథిలాల మధ్య నడుస్తూ ఆయన అక్కడి దృశ్యాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు.ఈ సందర్భంగా నెతన్యాహు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను జరిపిన సంభాషణ గురించి ప్రస్తావించారు. ‘‘నేను మా గొప్ప మిత్రుడు నరేంద్ర మోదీతో నిన్న సుదీర్ఘంగా మాట్లాడాను. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచినందుకు, సత్యం వైపు నిలబడినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను. భారత ప్రజల స్నేహాన్ని మేము ఎంతో గౌరవిస్తాం. ఇజ్రాయెల్ లో భారతీయులంటే ఎంతో అభిమానం ఉంది’’ అని చెప్పారు.
Latest News