వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్
 

by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:41 PM

రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సాగు సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా పెండింగ్ దరఖాస్తులన్నింటికీ అనుమతులు జారీ చేయాలని, రెండు నెలల్లోగా కనెక్షన్లను పూర్తిగా ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కంలను) ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ కోసం సుమారు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి అవసరమైన 10,000 కొత్త ట్రాన్స్‌‌ఫార్మర్లను కేటాయించనుంది. ఈ విషయంపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రెండు నెలల్లోగా పెండింగ్ కనెక్షన్లన్నీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని డిస్కంలను ఆదేశించామన్నారు. 

Latest News
Oppn criticises Punjab govt as two back-to-back blasts rock state in one day Wed, May 06, 2026, 12:41 PM
PM Modi, Vietnam's Prez To Lam hold bilateral talks at Hyderabad House Wed, May 06, 2026, 12:40 PM
Saka seals Arsenal's place in Champions League final Wed, May 06, 2026, 12:29 PM
UN welcomes Russian, Ukrainian unilateral ceasefires Wed, May 06, 2026, 12:25 PM
New Zealand unemployment down to 5.3 pc in Q1 Wed, May 06, 2026, 12:20 PM