|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 11:45 AM
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్‌లో కొద్దిరోజులు చిక్కుకుపోయిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సురక్షితంగా భారత్ చేరుకున్నారు. తన 'ఎక్స్' ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఈ క్లిష్ట పరిస్థితుల్లో తనకు సహకరించిన దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.అయితే, పరిస్థితులు కొంత చక్కబడటంతో ఎతిహాద్ ఎయిర్ లైన్స్ (Etihad Airways) అబుదాబి నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతోంది. తాజాగా అబుదాబి నుంచి 300 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం నాలుగు విమానాలు భారత్‌కు చేరుకోగా, ముంబై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో కూడా విమానాలు ల్యాండ్ అయ్యాయి. తమ వారు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందబాష్పాలతో స్వాగతం పలికారు.
Latest News