|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 07:38 PM
రేపు చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తలుపులను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, సర్వదర్శనం టోకెన్లు రద్దు చేశారు. సోమవారం రాత్రి వరకు మాత్రమే భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయ శుద్ధి అనంతరం రాత్రి 7.30 గంటల తర్వాతే భక్తులకు దర్శనం కల్పిస్తారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.
Latest News