|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 11:32 AM
రాష్ట్రంలో రైతులు మద్దతు ధరలు లేక అల్లాడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని వ్యవసాయం, రైతుల సంక్షేమ వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్సి ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. రెండో ప్రధాన పంట అయిన శెనగల కొనుగోలులో, ఈ-క్రాప్ పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. దిగుమతి సుంకాల్లేక ధరలు పడిపోతున్నా కేంద్రంపై ఒత్తిడి చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పైగా వైయస్ఆర్‌సీపీ హయాంలో రైతులకు ఏమీ చేయలేదంటూ అసెంబ్లీలో వ్యవసాయమంత్రి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారని ఎంవీఎస్ నాగిరెడ్డి ఆక్షేపించారు.
Latest News