కూటమి పాలనలో కల్తీ లేనిది ఏది లేదు
 

by Suryaa Desk | Mon, Mar 02, 2026, 11:31 AM

రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందిందని, “కల్తీ పాలన” కొనసాగుతోందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు విమర్శించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన‌ ఆయన ప్రభుత్వం తీరును తూర్పార‌బ‌ట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, పాలు, నీళ్లు కల్తీ అయి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. “నీళ్లు తాగినా కల్తీ, పాలు తాగినా కల్తీ, చివరకు పరిపాలన కూడా కల్తీగానే ఉంది” అని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలు భయాందోళనల్లో జీవిస్తున్నారని అన్నారు. ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే మేల్కొని రాష్ట్ర పరిస్థితిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా జ‌నం ప్రాణ‌సంక‌టంతో బ‌తుకుతున్నారు.  ‘చంద్రకర్ణ మేల్కో’ అని ప్రజలు మొరపెడుతున్నారు. పాలు, నీళ్లు కల్తీ అయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈరోజు రాష్ట్రంలో కల్తీ లేనిది ఏదీ లేదు. నీళ్లు తాగుదామన్నా కల్తీనే, పాలు తాగుదామన్నా కల్తీనే, మాట్లాడుదామన్నా కల్తీనే. చివరకు ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన కూడా కల్తీగానే మారింది. కూటమి ప్రభుత్వంలో ఎవరి దారి వారిదే. ప్రజలకు శాంతిభద్రతలు లేవు. కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి నెలకొంది. మొత్తం చిన్నబాబు మయం అయిపోయింది. ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు వస్తాయో లేదో అనుమానం. కానీ కూటమిలోని కొందరు నేతలకు మాత్రం సకాలంలో కమీషన్లు ముట్టుతున్నాయి అని వాపోయారు. 

Latest News
South Korea and Australia agree to enhance cooperation on stable energy supplies Thu, Apr 30, 2026, 04:38 PM
Delhi High Court grants interim relief to Karisma Kapoor's children, restrains widow in estate dispute Thu, Apr 30, 2026, 04:37 PM
Invest India facilitates 60 FDI projects worth $6.1 billion in FY26, creates over 31,000 jobs Thu, Apr 30, 2026, 04:34 PM
India Post Payments Bank's SHG savings account to boost financial inclusion Thu, Apr 30, 2026, 04:31 PM
Russia has no 'aggressive intentions' towards Europe: Medvedev Thu, Apr 30, 2026, 04:26 PM