విజయ్‌ని వెంటాడుతున్న '27'.. 6 నెలలుగా ఆ రోజునే ఘటనలు
 

by Suryaa Desk | Sun, Mar 01, 2026, 07:46 PM

కొన్ని నెలల క్రితం రాజకీయ అరంగేట్రం చేసిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత దళపతి విజయ్.. మరికొన్ని నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన విజయ్.. అటు అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సరికొత్త రాజకీయాలు చేస్తానంటూ ప్రకటించిన విజయ్.. తన పార్టీ విధి విధానాలను ప్రకటించి.. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని సంచలనాలు రేపుతున్నారో.. అదే స్థాయిలో విజయ్‌ విమర్శల పాలవుతున్నారు.


విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటన.. తర్వాత వరుసగా గత 6 నెలలుగా ఏదో ఒక సంఘటన 27వ తేదీన జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 27 సంఖ్యకు, విజయ్‌కి మధ్య ఏదో లింక్ ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు.


సెప్టెంబర్ 27 - కరూర్ తొక్కిసలాట ఘటన


అక్టోబర్ 27 - కరూర్ తొక్కిసలాట బాధితులను చెన్నైలో విజయ్ కలిసిన రోజు


నవంబర్ 27 - టీవీకేలో చేరిన సెంగొట్టయ్యన్


డిసెంబర్ 27 - జననాయగన్ ఆడియో లాంచ్


జనవరి 27 - మళ్లీ విచారణకు జననాయగన్ కేసు


ఫిబ్రవరి 27 - విజయ్‌తో విడాకుల కోసం కోర్టుకెక్కిన ఆయన భార్య సంగీత


ఆసక్తికరంగా విజయ్-సంగీత పెళ్లి జరిగి 27 ఏళ్లు కావడం గమనార్హం.


1999లో విజయ్-సంగీత పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు జాసన్ సంజయ్, దివ్య సాష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2023లో విజయ్-సంగీత మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే విజయ్, సంగీత ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయ్, సంగీత విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం కూడా జరిగింది.


ఈ నేపథ్యంలోనే వారిద్దరికీ పెళ్లి అయిన 27 ఏళ్ల తర్వాత.. ఇటీవలె సంగీత విడాకులు కావాలంటూ చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనలు అన్నీ 27వ తేదీనే జరుగుతుండటం యాదృచ్ఛికమా లేక దీని వెనుక ఏదైనా అనుబంధం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.


Latest News
Israel fighting for rights of Christians: PM Netanyahu Mon, Apr 27, 2026, 10:08 AM
Sensex, Nifty trade higher in early session on global optimism Mon, Apr 27, 2026, 10:02 AM
Heatwave in Rajasthan: Barmer, Jaisalmer record 46 degrees Mon, Apr 27, 2026, 09:59 AM
India, New Zealand set to sign key FTA to double trade, boost ties Mon, Apr 27, 2026, 09:47 AM
Heavy rain alert for western TN, strong winds likely till May 2 Mon, Apr 27, 2026, 09:42 AM