ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు....పశ్చిమాసియాలో మరో యుద్ధం
 

by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:43 PM

ఇరాన్‌పై అమెరికాా సహకారంతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది.. మిలటరీ స్థావరాలే లక్ష్యంగా క్షిపణులతో దాడి చేసింది. ఇజ్రాయెల్ ‘లయన్స్ రోర్’ పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టింది. టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక నగరాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో సహా 30 ప్రాంతాలo లక్ష్యంగా దాడులు చేసినట్టు అంతర్జాతీయ మీడియాా నివేదించింది. టెహ్రాన్‌ నగరమంతా పేలుళ్ల శబ్దంతో దద్దరిల్లుతోంది.. ఆ ప్రాంతంలో భారీగా పొగలు వ్యాపించాయి. అయితే అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్‌ రెచ్చిపోయింది.. ఈ దాడులు చేస్తోందంటున్నారు. ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌ నివాసంతో పాటుగా ఇంటిలిజెన్స్, రక్షణశాఖ ప్రధాన కార్యాలయాన్ని టార్గెట్ చేశారు.


ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.. ఏకంగా ఖమేని కార్యాలయం దగ్గరలో క్షిపణి దాడి జరిగింది. ఖమేని ఇల్లు, హెడ్ క్వార్టర్స్, ఆఫీసు సమీపంలో ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే దాడులకు ముందే ఖమేని బంకర్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుందన్నారు. అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు చేపట్టింది.. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదర్కొనేందుకు దాడులు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండటం వల్లే దాడులు చేస్తున్నామన్నారు ట్రంప్. ఇజ్రాయిల్ దాడులపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఈ యుద్ధానికి ఊహించని రీతిలో ముగింపు ఉంటుంది మండిపడింది. 'యుద్ధం మీరు ప్రారంభించారు మేము ముగిస్తాం. ప్రతీకారం దారుణంగా ఉంటాయి.. వేలాది మంది సైనికులు మరణించారని' ప్రకటించింది.


ఇటు ఇజ్రాయిల్ ముందుగానే అలర్ట్ అయ్యింది.. ఇరాన్ ప్రతి దాడులు చేసే అవకాశం ఉండటంతో దేశ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఇరాన్ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని.. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ముందుగానే సైరన్లు మోగాయి. ముందస్తు జాగ్రత్తగా స్కూళ్లు, కార్యాలయాలను మూసివేయాలని అలర్ట్ చేశారు. ఇజ్రాయెల్‌ పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్‌, ఇరాక్‌లు కూడా గగనతలాన్ని మూసివేశాయి. ఇరాన్‌లో మొబైల్‌ ఫోన్‌ సేవలు సైతం నిలిచిపోయాయి

Latest News
Pakistan's political system fails to allow women to lead Sun, Apr 12, 2026, 05:29 PM
Asha Bhosle was an iconic voice in Indian cinema: Pawan Kalyan Sun, Apr 12, 2026, 05:25 PM
Women's participation in flexi IT jobs rises to 40 pc in FY26: Report Sun, Apr 12, 2026, 05:19 PM
Asha Bhosle's 'immortal songs will forever resonate in our hearts': Union Ministers Sun, Apr 12, 2026, 05:09 PM
No deal in US-Iran talks, says JD Vance Sun, Apr 12, 2026, 04:35 PM