వెస్టిండీస్‌తో జరగనున్న మ్యాచ్ లో ఆడనున్న రింకూ సింగ్
 

by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:45 PM

భారత యువ క్రికెటర్ రింకూ సింగ్ తిరిగి జట్టుతో చేరనున్నాడు. తండ్రి మరణించిన మరుసటి రోజే, ఇవాళ‌ అతను జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ధ్రువీకరించింది. కీలకమైన సూపర్ 8 మ్యాచ్‌కు ముందు జట్టు కోల్‌కతాలో సమావేశం కానుంది.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రింకూ తండ్రి ఖంచంద్ సింగ్, గురువారం రాత్రి గ్రేటర్ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ వార్త తెలియగానే రింకూ శుక్రవారం ఉదయం చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. "రింకూ రేపు జట్టుతో కలుస్తాడు" అని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా పీటీఐకి తెలిపారు.తండ్రి అంత్యక్రియల కారణంగా రింకూ జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేశాడు.కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రేపు వెస్టిండీస్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు రింకూ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ టీమిండియాకు వర్చువల్ నాకౌట్‌ లాంటిది. ఇందులో గెలిచిన జట్టు గ్రూప్ 1 నుంచి దక్షిణాఫ్రికాతో పాటు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. 

Latest News
Trump invokes faith in Iran war rhetoric Tue, Apr 07, 2026, 11:46 AM
Rajasthan judges turn teachers to raise cybersecurity awareness in schools Tue, Apr 07, 2026, 11:46 AM
Expelled Cong leader Navjot Kaur Sidhu launches political outfit Bharatiya Rashtrawadi Party Tue, Apr 07, 2026, 11:45 AM
Gold, silver trade choppy as crude rallies over West Asia tensions Tue, Apr 07, 2026, 11:42 AM
IPL 2026: KKR and PBKS get a point each as rain washes out match Tue, Apr 07, 2026, 11:36 AM