హర్యానాలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు
 

by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:13 PM

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. నేపాల్‌ కు చెందిన 32 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కురుక్షేత్రలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బాధితురాలు.. తన స్నేహితురాలిని కలిసేందుకు మంగళవారం గురుగ్రామ్‌ కు వచ్చింది. అయితే, స్నేహితురాలు కనిపించకపోవడంతో అసంతృప్తికి గురై మద్యం సేవించింది.మద్యం మత్తులో ఉన్న ఆమె ఇంటికి వెళ్లేందుకు ఒక ఆటో రిక్షా ఎక్కింది. ఆ ఆటోలో అప్పటికే డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న ఆమెకు ఏం జరుగుతుందో తెలిసేలోపే, నిందితులు ఆమెను నహర్‌పూర్ రూపా ప్రాంతంలోని ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న గదికి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. బుధవారం ఉదయం ఆమెకు స్పృహ వచ్చేసరికి తాను ఒక తెలియని గదిలో ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే తేరుకుని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Latest News
JD(U) empowers Nitish Kumar to select new leader of Bihar Legislative Party Mon, Apr 20, 2026, 02:56 PM
Iran says to respond to 'armed maritime piracy' by US: Mon, Apr 20, 2026, 02:44 PM
DP World Players Championship to kick off from Tuesday Mon, Apr 20, 2026, 02:35 PM
S. Korea, US agree on bolstering anti-money laundering cooperation Mon, Apr 20, 2026, 02:35 PM
International flights to resume at Mashhad airport from Monday: Iran Mon, Apr 20, 2026, 02:23 PM