అరుదైన రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్
 

by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:07 PM

టీం ఇండియా యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డును అతను బద్దలుకొట్టాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఈ మ్యాచ్‌లో సికందర్ రజా, ర్యాన్ బర్ల్, టోనీ మున్యోంగాలను ఔట్ చేసిన అర్ష్‌దీప్.. టీ20 ప్రపంచకప్‌లలో తన మొత్తం వికెట్ల సంఖ్యను 35కి పెంచుకున్నాడు. దీంతో ఇప్పటివరకు 33 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న బుమ్రాను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. 

Latest News
No plans yet to attend next round of talks with US: Iran Mon, Apr 20, 2026, 04:44 PM
Nepal: Govt employees to receive salary on fortnightly basis Mon, Apr 20, 2026, 04:12 PM
Over 6,000 Afghan refugees repatriated from Pakistan in single day Mon, Apr 20, 2026, 04:09 PM
ECI announces 48-hour 'Dry Day' ahead of polling in West Bengal, Tamil Nadu Mon, Apr 20, 2026, 03:19 PM
BJP will end hooligans' rule in West Bengal: Rajnath Singh Mon, Apr 20, 2026, 03:05 PM